క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

IPL Cricket Betters Arrested In Khammam - Sakshi

మూడు సెల్‌ఫోన్లు, రూ.24 వేలు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన  డీఎïïస్పీ ఎస్‌ఎం.అలీ

సింగరేణి(కొత్తగూడెం): ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను టూ టౌన్‌ పోలీసులు నిఘా పెట్టి  పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను   డీఎస్పీ ఎస్‌ఎం.అలీ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో  క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం టూ టౌన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు కొంతమంది పాల్పడుతూ అమాయకులను బలిచేస్తున్న   ముగ్గురు వ్యక్తులు కడారి వేణుగోపాల్, దేవేందర్‌సింగ్, శ్రీరాములు విశ్వనా«థ్‌లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు సెల్‌పోన్లు, రూ.24 వేను స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ఎంబీఏ గోల్డ్‌మెడల్, ఎంటెక్‌ స్టూడెంట్, ఇంటర్నేషనల్‌ కిక్‌బాక్సర్‌లు ఉండటం విశేషం. చదువుకున్న వారు మంచి భవిష్యత్‌లో పయనించాల్సిన వారు ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటూ, డబ్బు సంపాదించాలనే అత్యాశతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీరు సెల్‌ఫోన్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని నెట్‌ పాయింట్‌ ద్వారా టీమ్‌లో టాప్‌గా ఉన్న టీమ్‌ను అంచనా వేసుకొని బాల్‌ టూ బాల్, ఓవర్‌ టూ ఓవర్, మ్యాచ్‌ టూ మ్యాచ్‌ను బట్టి టీమ్‌ ప్లేయర్‌ను బట్టి ప్లేయర్‌ మీద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు  బెట్టింగ్‌ కాస్తున్నారు. విలేకరుల సమావేశంలో టూ టౌన్‌ సీఐ గోపి, ఎస్సైలు కుమారస్వామి, అమీర్‌జానీ, సిబ్బంది పాల్గొన్నారు. బెట్టింగు రాయుళ్లను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ సునీల్‌దత్, డీఎïస్సీ ఎస్‌ఎం. అలీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top