‘వడ్డీకి బదులు కిడ్నీ తీసుకుంటాం’ | Instead of interest they take a kidney at tamilnadu | Sakshi
Sakshi News home page

‘వడ్డీకి బదులు కిడ్నీ తీసుకుంటాం’

Oct 25 2017 2:44 AM | Updated on Aug 29 2018 7:09 PM

Instead of interest they take a kidney at tamilnadu - Sakshi

రవి, సంపూర్ణం

సేలం(తమిళనాడు): తమిళనాడులో వడ్డీ వ్యాపారులు మరింత బరితెగించారు. వడ్డీ చెల్లించనందుకు ఓ వ్యక్తి కిడ్నీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అతని భార్య ఫిర్యాదుతో.. పోలీసులు ఆ ఘోరాన్ని అడ్డుకున్నారు. ఈరోడ్‌ జిల్లా కాశిపాళ్యంకు చెందిన రవి(45) చేనేత కార్మికుడు.

వడ్డీ వ్యాపారులు తన భర్తను కిడ్నాప్‌ చేసి ఎర్నాకుళం(కేరళ)లోని ఓ ఆస్పత్రికి తరలించారని అతని భార్య సంపూర్ణం ఈరోడ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. వడ్డీకి బదులు తన భర్త నుంచి కిడ్నీ తీసుకునేందుకు బుధవారం ఆపరేషన్‌ చేయాలని నిర్ణయిం చారంటూ విలపించింది. స్పందించిన కలెక్టర్‌ ప్రభాకరన్, ఎస్పీ శివకుమార్‌ విషయాన్ని ఎర్నాకుళం కలెక్టర్, అక్కడి పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆపరేషన్‌ను అడ్డుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement