కాటేసిన అనుమాన భూతం

Husband Killed Wife In Visakhapatnam - Sakshi

పోలీసులఅదుపులో నిందితుడు

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నడిరోడ్డుపై పాశవికంగా హత్యచేశాడు. ఒకటో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ పరిధి 26వ వార్డు పండావీధిలో వడిసెల మోహన్‌రావు, భార్య నాగమణి, పిల్లలు దుర్గారావు (13), హంసిక (11)లతో కలిసి జీవిస్తున్నాడు. వీరిరువురు 2004లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మోహన్‌రావు టౌన్‌ కొత్తరోడ్డులో ట్రాన్స్‌పోర్టు కలాసీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో భార్య నాగమణి మూడేళ్లుగా సిరి పురం ఉడా భవనంలో ఉన్న ఫుడ్‌ ఎక్స్‌ దుకాణంలో పండావీధికి చెందిన కొందరు మహిళలతో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇద్దరి మధ్య నాలుగైదు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తాము నివసించే ఇంటికి సమీపంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పిల్లలను తీసుకుని నాగమణి వెళ్లిపోయింది. అదే సమయంలో మోహన్‌రావు సెల్‌ కనిపించకుండా పోయింది. అనంతరం అది భార్య నాగమణి వద్ద దొరికింది. అయితే తన ఫోన్‌లో తాను వేసిన సిమ్‌కు బదులు మరొక సిమ్‌ ఉండడంతో తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని మోహన్‌రావు అనుమానించాడు. ఈ విషయంపై రెండు సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నాగమణిని భర్త వద్దకు పంపారు. అప్పటికి తగువు చల్లబడ్డా తరువాతి కాలాంలో మరలా మనస్పర్థలు బయలు దేరాయి.

నడిరోడ్డుపై పాశవికంగా పొడిచి...
ఈ నెల 25న రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో మోహన్‌రావు తన భార్యను చంపేస్తానని బెదిరించడంతో భయపడిన నాగమణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాగమణి పనిచేస్తున్న ఫుడ్‌ఎక్స్‌కు ఈ నెల 27న (శనివారం) రాత్రి మోహన్‌రావు వెళ్లాడు. భార్య వచ్చేవరకూ ఎదురు చూసి నాగమణితో పాటు అక్కడ పనిచేస్తున్న పండావీధికి చెందిన మహిళలతో పాటుగా ఆటోలో పాత నవరంగ్‌ థియేటర్‌ వద్దకు చేరుకున్నాడు. సుమారు 11.30 గంటలకు ఆటో దిగిన తరువాత భార్యను తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తూనే తన వద్ద దాచుకున్న కత్తితో దాడిచేసి ఛాతీ, కడుపు వంటి సున్ని త ప్రాంతాల్లో 8 వరకూ పోట్లు పోడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

తమకు సమీపంలో జరిగిన దారుణాన్ని వారితో పాటు వచ్చిన మహిళలు చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి నాగమణి ఘటనా స్థలంలోనే మరణించింది. అయితే మోహన్‌రావు తల్లి అప్పలనర్సమ్మ ప్రోద్బలం వల్లనే భార్యను క్షణికావేశంలో హత్య చేశాడన్న ఆరోపణ ఆ ప్రాంతంలో బలంగా విని పిస్తోంది. సమాచారం అందుకున్న ఒకటో పట్ట ణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీ సుకున్న పోలీసులు ఏసీపీ రంగరాజు ఆధ్వర్యం లో సీఐ ఉమాకాంత్‌ బృందం విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top