ఆస్తికోసం గెంటేశారు! | Husband Family Not Allowed to Wife And Child For Assets Gadwal | Sakshi
Sakshi News home page

ఆస్తికోసం గెంటేశారు!

Jul 21 2020 11:03 AM | Updated on Jul 21 2020 11:03 AM

Husband Family Not Allowed to Wife And Child For Assets Gadwal - Sakshi

గద్వాల క్రైం : ప్రమాదంలో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళను ఆదుకోవాల్సిన బంధువులే ఆస్తికోసం మహిళతో పాటు  చిన్నారిని ఇంటి నుంచి గెంటి వేసిన సంఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో పట్టణంలోని గంజిపేట కాలనీకి చెందిన మహబూబ్‌బాషతో అమరచింత మండలం చిన్న కడుమూరు గ్రామానికి చెందిన హసీనాకు పెద్దలు వివాహం చేశారు. అయితే 2017లో ప్రమాదవశాత్తు భర్త మృతి చెందాడు.

ఆమెకు జీవనోపాధి కింద పెద్దల ఆస్తిని తన పేరిట రాసిస్త్మాని అంగీకరించారు. ప్రస్తుతం  మృతుడి తాత హసీనాకు ఆస్తి ఇవ్వకుండా గత కొన్ని రోజులుగా  వేధింపులు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం వాగ్వాదం జరగ్గా ఇంటికి తాళం వేసి వారిని రోడ్డున పడేశాడు. దీంతో బాధితురాలు పట్టణంలోని సఖీసెంటర్‌ను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని నిర్వాహకులను వేడుకుంది. ప్రస్తుతం హసీనాకు 3ఏళ్ల చిన్నారి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement