నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

Hero Ganesh Wife Shilpa Complaint On Social Media Virals - Sakshi

యశవంతపుర: సోషల్‌ మీడియాలో తన ఫొటో  ఉంచి నాడుప్రభు కెంపేగౌడకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీహీరో గణేశ్‌ భార్య శిల్ప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కెంపేగౌడ కంటే గొప్పపనులు చేసినవారు అనేక మంది ఉన్నారు. సిల్క్‌ వర్శిటీకి కెంపేగౌడకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు’ అని రాసి శిల్ప ఫొటోను జతచేసి ఫేస్‌బుక్‌లో కొందరు పోస్టు చేశారు.

దీంతో శిల్పపై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నాడుప్రభు కెంపేగౌడపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయనను అవమానించాల్సిన అవసరం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కొందరు కావాలనే తనకు చెడ్డపేరు తేవడానికి ఇలాంటి పోస్టులు చేసిన్నట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శిల్ప పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top