బ్లూఫిల‍్ములు చూపించి... | girl raped in krishna district | Sakshi
Sakshi News home page

బ్లూఫిల‍్ములు చూపించి...

Jan 8 2018 11:32 AM | Updated on Jul 28 2018 8:44 PM

సాక్షి, కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం): సెల్‌ఫోన్‌లో భ్లూఫిల్ములు చూపించి బాలికపై లైంగికదాడికి పాల‍్పడిన సంఘటన కృష్ణాజిల్లాలో వెలుగుచూసింది. ఇనుగుదురుపేట ఎస్‌ఐ కుమార్‌ కథనం మేరకు వివరాలు...

ఇనుగుదురుపేట పట‍్టణంలోని రాజుపేటకు చెందిన వేముల పాపారావు వంటమేస్త్రిగా పనిచేస్తుంటాడు. అతని ఇంటికి సమీపంలో ఉండే తన కుమార్తె స్నేహితురాలికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూపించి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

బాలిక ప్రవర‍్తనలో మార్పు రావడం గమనించిన బాలిక తండ్రి అనుమానం వచ్చి బాలికను నిలదీయడంతో ఏడుస్తూ విషయం చెప్పింది. దాంతో బాలిక తండ్రి ఆదివారం సాయంత్రం ఇనుగుదురుపేట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున‍్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement