యువతిపై గ్యాంగ్‌రేప్‌

Girl Molestation By Six Boys At Mahabubabad - Sakshi

ఆరుగురిపై కేసు నమోదు

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా బలరాంతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ యువతిపై ఆరుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మహబూబాబాద్‌ మండలం బలరాంతండాకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలో అతను ఆమెకు తరచూ ఫోన్‌ చేస్తుండేవాడు. అందులో భాగంగా శుక్రవారం ఆ యువతిని బలరాంతండాకు రమ్మని ఫోన్‌ చేయగా వెళ్లింది.

రాత్రి సమయంలో యువతి తండాకు చేరుకోగా ఫోన్‌ చేసిన వ్యక్తితో పాటు అక్కడే ఉన్న మరో ఐదుగురు ఆ యువతిని గ్రామ శివారులోని మామిడి తోటలోకి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో అటువైపుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించి సంఘటన స్థలానికి చేరుకోగా ఆరుగురు పరారయ్యారు. ఆ వ్యక్తులు యువతితో మాట్లాడగా.. జరిగిన విషయం వివరించింది. స్థానికులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో రూరల్‌ పోలీసులు చేరుకుని యువతితో పాటు ఆరుగురిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ సీఐ తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వారు మైనర్లు అని సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top