హన్మకొండ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు.
సాక్షి, వరంగల్ అర్బన్ : హన్మకొండ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. కారులో అక్రమంగా 225 కిలోల గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో బయటపడింది. నిందితులు గంజాయిని విశాఖ జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన సుభాష్ చౌహన్‌గా గుర్తించారు. పోలీసుల రాక గమనించి మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.