టెన్త్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Gang Rape On Tenth Class Student - Sakshi

సాక్షి, బెంగళూరు (విజయపుర): విజయపుర జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని (15)పై కొందరు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడి, ఆ ఘోరం బయటపడకుండా హత్య చేయబోయారు. బాలిక రోజూ మాదిరి స్కూల్‌ ముగించుకుని సాయంత్రం 4:30 సమయంలో ఇంటికి బయలుదేరగా, నలుగురు దుండగులు బాలికను బలవంతంగా అరటి తోటలోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి వెతుకుతూ అరటి తోట వద్దకు చేరుకున్నాడు. అక్కడ కుమార్తె హాహాకారాలు విని పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆయన వెళ్లేటప్పటికే బాలికను అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి దుండగులను తరిమికొట్టడంతో పాటు వీరేశ్‌ అనే నిందితున్ని పట్టుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top