
యశవంతపుర: డ్రాప్ పేరుతో దుండగులు ఓ వ్యక్తిని నిలువునా దోచుకున్నారు. ఈఘటన మహాలక్ష్మి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. లగ్గేరికి చెందిన సంతోష్ అనే వ్యక్తి దేవాలయానికి వెళ్లేందుకు మహాలక్ష్మి లేఔట్ వద్ద బస్సు కోసం వేచి ఉన్నాడు.ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు డ్రాప్ ఇస్తామని సంతోష్‌ను వాహనంలో ఎక్కించుకున్నారు.
దాదాపు నాలుగు గంటలపాటు అతన్ని వాహనంలోనే తిప్పారు. హెబ్బాళ సమీపంలో సంతోష్‌ను చాకుతో బెందిరించి సెల్‌ఫోన్, ఎటీఎం కార్డు లాక్కున్నారు. పిన్ నంబర్ తెలుసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అతని ఖాతానుంచి రూ. 14వేలు డ్రా చేసి మార్గం మధ్యలో కిందకు నెట్టేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.