పట్టపగలు అందరూ చూస్తుండగానే.. లైవ్‌ ఎన్‌కౌంటర్‌ | Encounter in Bihar's Muzaffpur in broad daylight | Sakshi
Sakshi News home page

పట్టపగలు అందరూ చూస్తుండగానే.. లైవ్‌ ఎన్‌కౌంటర్‌

Feb 2 2019 1:59 PM | Updated on Feb 2 2019 5:05 PM

Encounter in Bihar's Muzaffpur in broad daylight - Sakshi

పట్నా: బిహార్‌లో లైవ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. క్రిమినల్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు పోలీసులు. కరుడుగట్టిన నేరస్తుడ్ని కాల్చిచంపారు. బిహార్ ముజఫర్ పూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. 10మంది నేరగాళ్లు బస్సులో కుందన్‌సింగ్ అనే వ్యక్తిపై నాలుగురౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగానే అందరూ పారిపోగా.. ఒక క్రిమినల్‌ మాత్రం అందులో ఉండిపోయాడు. దీంతో అతడిని చంపేయాలంటూ జనం కేకలు పెట్టారు. పోలీసులు లొంగిపోవాలని అవకాశం ఇచ్చినా.. అతడు మాత్రం పోలీసులపై కాల్పులకు దిగాడు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు అతడ్ని హతమార్చారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement