తాగిన మత్తులో పోలీసులను చెడుగుడు ఆడేశాడు! | Drunk Man Fights with Police in sircilla | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో పోలీసులను చెడుగుడు ఆడేశాడు!

Oct 13 2019 11:40 AM | Updated on Oct 13 2019 11:52 AM

Drunk Man Fights with Police in sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్లా: తాగిన మందు తలకెక్కింది. ఇంకేముంది మత్తులో ఉన్న మందుబాబు డ్యూటీలో ఉన్న పోలీసులనే చెడుగుడు ఆడేశాడు. మందుబాబు దాడి చేస్తుంటే..రక్షకభటులను స్థానికులు రక్షించిన ఘటన సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నామాపూర్‌కు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఊరికి బస్సు ఎందుకు లేదని హల్‌ చల్‌ చేస్తూ దాడికి దిగాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు అతడిని పట్టుకుని పీఎస్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement