పాపం..పసి పాప | Dogs Attack on Birth Child in Banjara Hills Hyderabad | Sakshi
Sakshi News home page

పాపం..పసి పాప

Sep 30 2019 7:49 AM | Updated on Sep 30 2019 7:49 AM

Dogs Attack on Birth Child in Banjara Hills Hyderabad - Sakshi

శిశువును పీక్కుతున్న కుక్కలు  

బంజారాహిల్స్‌:  బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలీ అస్గర్‌ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజమున బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 13లోని హిందూ శ్మశాన వాటిక ముందు నుంచి ఇంటికి వెళ్తున్నాడు.

అదే సమయంలో కొన్ని కుక్కలు అరుస్తుడటంతో వాటిని తరిమేయగా ఓ శిశువు కాళ్ళు, చేతులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండగా మెడంతా కోసుకుపోయింది. కుక్కలు శిశువును పీక్కు తింటున్నట్లుగా గుర్తించిన అతను బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు శరీర భాగాలను ఒక్క చోటకు చేర్చి ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిశువు వారం రోజుల క్రితం జన్మించి ఉండవచ్చునని శ్మశాన వాటిక పక్కన పడేసి వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement