పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి | Couple Died With Chemical Mixing in Food Tamil nadu | Sakshi
Sakshi News home page

పురుగుల మందుతో బోండాలు

Apr 9 2020 7:36 AM | Updated on Apr 9 2020 7:55 AM

Couple Died With Chemical Mixing in Food Tamil nadu - Sakshi

మృతి చెందిన దంపతులు (ఫైల్‌)

అరక్కోణం: తెలియక చేసిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. రాణిపేట జిల్లా ఎస్‌ఆర్‌ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు పెరియస్వామి (65), భార్య లక్ష్మి (57), కుమారుడు శివకుమార్‌ (27), కోడలు భారతి (22). పెరయస్వామి మంగళవారం రాత్రి బోండాలు చేసేందుకు మైదాపిండి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అలాగే మిరప తోటకు క్రిమిసంహారక మందు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలియని కోడలు భారతి రెండూ కలిపి బోండాలు వేసింది.

నలుగురూ తినడంతో కొంతసేపటికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామస్తులు వారిని షోలింగర్‌ ప్రభుత్వాస్పత్రికి అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భారతి, శివకుమార్‌ మృతిచెందారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాదిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement