రేప్‌ చేయలేదు కదా? చేశాక చూద్దాం : పోలీసులు

UP Cops Refuse to Act on Women Harassment Complaint - Sakshi

లక్నో : ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై దాడి ఘటనపై దేశం అట్టుడికిపోతుండగా, అదే జిల్లాలో మరో విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్‌ జిల్లాలోని సిందుపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే అత్యాచారం ఇంకా జరగలేదు కదా! జరిగాక వచ్చి ఫిర్యాదు చేయు. అప్పుడు చూద్దామని బదులిచ్చారు.

బాధితురాలి కథనం ప్రకారం.. ‘స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న తనను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి మొదట నేను 1090 కి కాల్‌ చేశాను. వాళ్లు 100కు ఫోన్‌ చేయమన్నారు. 100కు ఫోన్‌ చేస్తే ఉన్నావ్‌ స్టేషన్‌కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బిహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్‌ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుంద’ని ఆమె ఓ జాతీయ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ విషయంపై అక్కడి ఐజీని మీడియా వివరణ కోరగా ఆయన అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం.  (చదవండి) ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top