
సాక్షి, తెనాలి: వయస్సు తప్పుగా చెప్పి మోసం చేసి ఓ యువకుడు తనను వివాహం చేసుకున్నాడని సఫియా అనే యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన సఫియాకు తన స్నేహితుల ద్వారా గురజాలకు చెందిన షేక మహమ్మద్ హసన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లు.
ఈ నేపథ్యంలో గత డిసెంబరులో వివాహం చేసుకున్నారు. మహమ్మద్ హసన్ తనను పెళ్లి చేసుకునే సందర్భంలో అతని వయసు 22గా చెప్పాడని, అయితే వయసు 19గా తెలిసిందని సఫియా తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్‌ఐ టి. అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. సఫియా, ఆమె కుటుంబసభ్యులు తనను మోసం చేసి, మభ్య పెట్టి వివాహం జరిపించారంటూ మహ్మద్ హసన్ గతంలోనే గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అక్కడ ఇప్పటికే కేసు కేసు నమోదైంది.