టాయ్‌లెట్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి | Class 9 Student Dead In Karnataka Military School | Sakshi
Sakshi News home page

టాయ్‌లెట్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి

Jun 25 2018 3:52 PM | Updated on Sep 15 2018 5:45 PM

Class 9  Student Dead In Karnataka Military School - Sakshi

 బెంగళూరు: గుజరాత్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కర్ణాటకలో కలకలం రేపింది. కొడగు జిల్లాలోని సైనిక పాఠశాల్లోని టాయ్‌లెట్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగులో సైనిక పాఠశాలలో తొమిదో తరగతి విద్యార్థి(14) శనివారం సాయంత్రం టాయ్‌లెట్‌ వద్ద అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.

విద్యార్థి తండ్రి అదే పాఠశాలలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలోని కొంత మంది ఉపాధ్యాయులు తన కొడుకుని వేధించినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కొడుకు మృతికి వైస్‌ ప్రిన్సిపాల్‌ కారణం మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్‌, మరో నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement