ప్రార్థన పేరుతో నయవంచన

Church Father Molestation on Mother And Daughter in Prakasam - Sakshi

తల్లీకుమార్తెను లోబరుచుకున్న పాస్టర్‌ జాన్సన్‌

బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి

తీసుకున్న పోలీసులు

ఒంగోలు, మద్దిపాడు: మండలంలోని రాచవారిపాలెం ఎస్సీ కాలనీలో పాస్టర్‌గా పని చేస్తున్న గంగుల జాన్సన్‌ తనను మోసం చేశాడని ఆదే గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన వివరాల ప్రకారం.. రాచవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు మహిళలు ప్రార్థన కోసం చర్చికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాస్టర్‌ ఆమెను లోబరుచుకున్నాడు.

ఆ తర్వాత ఆమె తల్లిని కూడా మాయమాటలతో లోబరుచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వద్ద 4 లక్షల 75 వేల రూపాయలు తీసుకుని సొంతానికి వాడుకున్నాడు. డబ్బు ఇచ్చిన విషయం కేవలం తనకు, పాస్టర్‌కు, ఆయన భార్యకు మాత్రమే తెలుసని బాధితురాలు చెబుతోంది. గత జూన్‌  నుంచి తల్లీకుమార్తెను బయట ప్రాంతాల్లో తిప్పుతూ మూడు నెలల నుంచి ఒంగోలులో ఉంచాడు. పాస్టర్‌కు తన తల్లి ఇచ్చిన విçషయం తెలుసుకున్న యువతి తమ డబ్బు తమకు ఇవ్వాలని, లేకుంటే ప్రార్థన జరిగే సమయంలో పెద్దల మధ్యకు వస్తానని పాస్టర్‌కు మెసేజ్‌ పెట్టింది. ఆయన ఫిర్యాది తల్లికి ఫోన్‌ చేసి ఫిర్యాదిని చంపేస్తే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని, మన మధ్య అడ్డు లేకుండా పోతుందని పాస్టర్‌ చెప్పాడు. అందులో భాగంగా ఫిర్యాదిని చంపేందుకు ఒంగోలుకు చెందిన వ్యక్తితో ప్లాన్‌ చేశాడు. తనను చంపేందుకు ప్లాన్‌ చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు, పాస్టర్‌ మాటలు రికార్డు చేసి తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాలనీ వాసులు మాట్లాడుతూ పూర్తిగా నమ్మిన పాస్టర్‌ ఈ విధంగా  మోసపూరితంగా వ్యవహరించి మహిళలను లోబరచుకుంటున్నాడని ఆరోపించారు. ఆయన ఇప్పటి వరకూ సుమారు ఎనిమిది మంది మహిళలను యువతులను మోసపూరిత మాటలతో లొంగబరుచుకున్నాడని, వారి నుంచి డబ్బు వసూలు చేశాడని ధ్వజమెత్తారు. కాపురం పోతుందన్న భయంతో మహిళలు బయటకు రావడం లేదని పేర్కొన్నారు.

సాయంత్రం పాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్‌ బయట కాలనీ వాసులు గుమిగూడి తమకు పాస్టర్‌ను చూపాలని, అతనితో మాట్లాడాలని కొరడంతో ఎస్‌ఐ గ్రామానికి చెందిన పెద్దమనుషులను లోపలికి పిలిచి వారితో మాట్లాడారు. ఈ క్రమంలో బయట నిలబడిన పలువురు కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఇళ్లకు వెళ్లేది లేదని భీíష్మించడంతో ఎస్‌ఐ వారితో మాట్లాడుతూ ఫాదర్‌ను పూర్తిస్థాయిలో విచారించి అతడిని కోర్టుకు పంపుతామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top