బాబు గోగినేనిపై కేసు నమోదు.. | Case file On Famous Rationalist Babu gogineni In Madhapur Police Station | Sakshi
Sakshi News home page

Jun 26 2018 7:25 PM | Updated on Sep 4 2018 5:44 PM

Case file On Famous Rationalist Babu gogineni In Madhapur Police Station - Sakshi

ప్రముఖ హేతువాది బాబు గోగినేని

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై కేసు నమోదు అయ్యింది. కేవీ నారాయణ, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై దేశ ద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్‌ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు.

సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు బాబు గోగినేని ఫౌండర్‌గా ఉన్నారని, ఈ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు మలేషియాలో నిర్వహిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్‌లో  పాల్గొనే వారి నుంచి బాబు గోగినేని, అతని అనుచరులు ఆధార్‌ నంబర్‌ తీసుకోవడమే కాకుండా.. ఆధార్‌ నంబర్లను నెట్‌లో పెట్టారని మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement