బీఎస్‌ఎఫ్‌లో ఇంటిదొంగల కలకలం; నిఘా పెంపు

Bsf officers special operation to identify wrongdoers - Sakshi

న్యూఢిల్లీ : దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో ఇంటిదొంగల వ్యవహారం కలకలం రేపుతున్నది. శత్రుదేశాల ఏజెంట్లు, అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగుచూడటంతో అధికారులు అంతర్గత నిఘాను పటిష్టం చేశారు. విలాసవంమైన జీవనం గడుపుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు.

ఈమేరకు 2017 సంవత్సరానికి గానూ అనుమానితుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవలే బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉగ్రవాదులకు సహకరిస్తోన్న బీఎస్‌ఎఫ్‌ కమాండింగ్‌ అధికారిని సెంట్రల్‌ ప్రోబ్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల సిబ్బంది కల్గిన బీఎస్‌ఎఫ్‌ ప్రతిష్టను కాపాడటం కోసమే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతియడానికి కాదని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top