ఐదో రోజే నవవధువు ఆత్మహత్య | Bride Committed Suicide In Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య

Jul 14 2020 7:21 AM | Updated on Jul 14 2020 9:34 AM

Bride Committed Suicide In Tamil Nadu - Sakshi

దేవి(ఫైల్‌)

సాక్షి, చెన్నై: వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్‌ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్‌(29) ఈ నెల 8న పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నారు. శనివారం ఉదయం దంపతులిద్దరూ దేవి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వెలుపల సెల్వరాజ్‌ బంధువులతో మాట్లాడుతున్నాడు.

ఇంట్లోకి వెళ్లిన దేవి హఠాత్తుగా తలుపులు వేసుకుంది. సమయం గడుస్తున్నా  బయటకు రాకపోవడంతో తలుపు తట్టారు. స్పందన లేకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఇంటి దూలానికి దేవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన తారాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సెల్వరాజ్, దేవి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.   

చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement