బాలుడి కిడ్నాప్‌ కలకలం | Boy Kidnapped Attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్‌ కలకలం

Jul 16 2019 9:24 AM | Updated on Jul 16 2019 9:24 AM

Boy Kidnapped Attempt in Hyderabad - Sakshi

అనుమానిత మారుతి ఓమ్ని వ్యాన్‌ గాయపడిన జమాలుద్దీన్‌

అంబర్‌పేట: ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన సంఘటన సోమవారం అంబర్‌పేట్‌లో కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట ఇరానీ హోటల్‌ సమీపంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి జాఫర్‌ కుమారుడు జమాలుద్దీన్‌(9) సోమవారం సాయంత్రం పెన్సిల్‌ కొనుక్కునేందుకు రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో ఓమ్ని మారుతి వ్యాన్‌లో అక్కడికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని వ్యాన్‌లోకి లాక్కుని ముందుకు వెళ్లారు.

అనంతరం హామారకు అచ్చా మాల్‌ మిల్‌గయా(మనకు మంచి సరుకు దొరికింది) అంటూ ఫోన్‌లో ఎవరికో చెబుతుండటాన్ని విన్న మాటలు విన్న జమాలుద్దీన్‌ వారు తనను కిడ్నాప్‌ చేస్తున్నట్లు గ్రహించాడు. వ్యాన్‌ స్లో కాగానే అందులోనుంచి  బయటికి దూకాడు. స్వల్పంగా గాయప డిన అతను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరా లు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రమేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement