బీజేపీ నేత కుమారుడి దారుణ హత్య

BJP Leader Son Shot Dead in UP Baghpat - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ బాగ్‌పట్‌ జిల్లా బసోలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ధాన్యాలు విసరే అంశంలో జరిగిన గొడవ ఓ మైనర్‌ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. వివరాలు.. నిన్న సాయంత్రం  యువకుడి కుటంబంతో కొందరు వ్యక్తులు ధాన్యం విసిరే అంశంపై గొడవపడ్డారు. మంగళవారం నిందితులు మరికొందరితో కలిసి యువకుడి ఇంటి మీదకు వచ్చి కాల్పులకు తెగ బడ్డారు. ఈ దాడిలో యువకుడు మరణించాడు. అడ్డుకోవడానికి వచ్చిన జనాల మీద కూడా నిందితులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఇద్దరు నిందితులపై దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చనిపోయిన యువకుడిని జిల్లా బీజేపీ నాయకుడు పాదం కుమారుడిగా గుర్తించారు. ఈ క్రమంలో పాదం మాట్లాడుతూ.. ‘గతంలో మా మామ కొడుకును చంపేశారు.. ఇప్పుడు నా కుమారుడిని హతమార్చారు. దుండగులు ఈ ప్రాంతం వారే. మాకు న్యాయం కావాలి’ అని విలపించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top