మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు

Attack on AV Subba Reddy Case Akhila Priya Name goes Missing - Sakshi

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసుల అత్యుత్సాహం

సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్‌ యాత్రను కొనసాగిస్తున్నారు.

ఏం జరిగింది?: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. మంత్రి పేరును తొలగించి, పోలీసులే సాక్ష్యులుగా మరో కేసు నమోదుచేసి, దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిఉంది. రాళ్లదాడి అనంతరం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

(చదవండి: ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి; ఆళ్లగడ్డలో ఉద్రిక్తత)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top