కలకలం రేపుతోన్న తలలేని మహిళ మృతదేహం

In Assam Woman Headless Body Found Near Kamakhya Temple - Sakshi

దిస్పూర్‌ : ప్రముఖ కామాఖ్యా దేవి ఆలయం సమీపంలో బుధవారం తలలేని మహిళ మృతదేహం(మొండెం) పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. క్షుద్ర పూజల్లో భాగంగా బలిచ్చారా లేక స్వయంగా ప్రాణ త్యాగం చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం సమీపంలో మృతదేహాన్ని కనుగొనడంతో ప్రాణత్యాగం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం చుట్టుపక్కల మట్టి ప్రమిద, కుండ, పూజ నిమిత్తం ఉపయోగించే ఎరుపు దారం, ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ వంటి వస్తువులను పోలీసులు గుర్తించారు.

ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘మృత దేహం దగ్గర లభ్యమైన వస్తువులన్నింటిని పూజా కార్యక్రమాల కోసమే వినియోగిస్తారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నూనె తీసుకువచ్చారేమో అనిపిస్తుంది. అంతేకాక మృతురాలి శరీరం మీద దాడి చేసినట్లు, పెనుగులాడినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ప్రాథమిక రిపోర్టులో తెలిసింది. ఇక ఈ ప్రాంతంలో అనుమానాస్పాదంగా ఎలాంటి కేకలు, అరుపులు వినపడలేదని స్థానికులు తెలిపారు. అంటే మృతురాలు స్వయంగా ప్రాణత్యాగం చేసి ఉండాలి.. లేదంటే ఎవరైనా ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉండాలి. ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు సాగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top