శోభరాణి ఆత్మహత్యకు నిరసనగా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

Anganwadi Employees Unions Protests At Kurnool Collectorate - Sakshi

సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శోభారాణి  శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన భార్య ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగలేకపోయినా తీవ్ర పని ఒత్తిడికి గురిచేశారని ఆయన ఆరోపించాడు. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురిచేయడం వల్లే శోభారాణి బలవన్మరణం చెందిందని తెలిపాడు.

కాగా, శోభారాణిని మానసిక వేదనకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్‌ (అంగన్‌వాడీ) ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టాయి. శోభారాణి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని  అంగన్‌వాడీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top