85 రోజుల తర్వాత.. ఎట్టకేలకు | actor dileep got bail in kidnap case | Sakshi
Sakshi News home page

నటుడు దిలీప్‌కు బెయిల్‌!

Oct 3 2017 2:22 PM | Updated on Apr 3 2019 9:01 PM

actor dileep got bail in kidnap case - Sakshi

కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన నటుడు దిలీప్‌కు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరుచేసింది. దీంతో 85 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది.

గత ఫిబ్రవరిలో మలయాళ నటిని కారులో కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన సూత్రధారిగా దిలీప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జూలై 10న  దిలీప్‌ను అరెస్టుచేసిన పోలీసులు.. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పక్కాగా ఆధారాలు  సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలుసార్లు కేరళ హైకోర్టును, దిగువ కోర్టును బెయిల్‌ కోసం దిలీప్‌ ఆశ్రయించినా.. చుక్కెదురైంది. ఈ కేసులో దిలీప్‌ ప్రధాన నిందితుడు అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని, ఆయనకు బెయిల్‌ ఇస్తే.. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి.. గతంలో బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. తాజాగా బెయిల్‌ కోసం దిలీప్‌ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. దిలీప్‌ హీరోగా తెరకెక్కిన 'రామ్‌లీల' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement