శంకరయ్య ఇంట్లో భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ

ACB Searches At CI Shankarayya House Ended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూతగాదా కేసులో లక్షా 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన షాబాద్‌ సీఐ శంకరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 4కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడంతో పాటు, విలువైన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కాగా.. ఇప్పటికే సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌లకు ఏసీబీ కరోనా పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్‌ఐలను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి షాబాద్‌ సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: ఏసీబీ వలలో సీఐ, ఏఎస్‌ఐ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top