రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం | 39 Killed After Bus Falls Off Bridge In Rajasthan, Driver Was 16 | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం

Dec 24 2017 3:01 AM | Updated on Dec 24 2017 3:14 AM

39 Killed After Bus Falls Off Bridge In Rajasthan, Driver Was 16 - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 33 ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న మైనర్‌ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని లాల్సోట్‌ నుంచి జిల్లా కేంద్రానికి 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు సూర్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బనాస్‌ నదిపై ఉన్న వంతెనపైకి రాగానే అదుపుతప్పి నదిలో పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ , కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విచారం వ్యక్తం చేశారు. చనిపోయినవారికి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 19 మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement