311 సబ్సిడీ గొర్రెల పట్టివేత | 311 Subsidized Sheeps Captured | Sakshi
Sakshi News home page

311 సబ్సిడీ గొర్రెల పట్టివేత

Jul 7 2018 1:38 PM | Updated on Jul 7 2018 1:38 PM

311 Subsidized Sheeps Captured - Sakshi

  ఖాసీంపేటలో పట్టుబడిన సబ్సిడీ గొర్రెలు 

చివ్వెంల(సూర్యాపేట) : అక్రమంగా తరలిస్తున్న 311 సబ్సిడీ గొర్రెలను శుక్రవారం పోలీసులు వేర్వేరు చోట్ల పట్టుకుని స్టేషన్లకు తరలించారు.  చివ్వెంల మండలం దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేట గ్రామంలో  200 గొర్రెలు,  దామరచర్ల మండలం వాడపల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 111 గొర్రెలను పట్టుకున్నారు.

వివరాలు.. తొండ తిరుమలగిరికి చెందిన నలుగురు వ్యక్తులు 200 గొర్రెలను ఆంధ్రాలో విక్రయించేందుకు నడక దారిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సబ్సిడీ గొర్రెలను అమ్మేందుకు తమకు కూలి ఇచ్చి పంపించారని వారు తెలపడంతో పోలీసులు గొర్రెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

వాడపల్లి చెక్‌పోస్టు వద్ద..  

దామరచర్ల(మిర్యాలగూడ) : అక్రమంగా తరలిస్తున్న 111 సబ్సిడీ గొర్రెలను దామరచర్ల మండలం వాడపల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నట్టు వాడపల్లి ఎస్‌ఐ నగేశ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన వాడపల్లిలో విలేకరులతో మాట్లాడారు.

సిరిసిల్ల నుంచి గురువారం రాత్రి లారీలో గుం టూరు జిల్లా వెల్దుర్తికి గొర్రెలను తరలిస్తుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.  లారీలో 122 గొర్లు ఉన్నాయని, వీటిలో 111 సబ్సిడీ గొర్రెలు ఉన్నాయని మండల పశువైద్యాధికారి తెలిపారు.లారీ ఓనర్, డ్రైవర్‌లతో పాటుగా గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement