రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం | 2 KG Gold Foils Concealed, Man Were Arrested In Delhi Airport | Sakshi
Sakshi News home page

రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం

Mar 21 2018 8:32 PM | Updated on Oct 9 2018 5:39 PM

సాక్షి, న్యూఢిల్లీ:  విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెస్తూ ఓ ప్రయాణికుడు దొరికిపోయాడు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకువచ్చేందుకు అతగాడు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే... దుబాయ్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.58 లక్షల విలువ చేసే 1930 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ ప్రయాణికుడు బంగారాన్ని .. పలుచని రేకులుగా తయారు చేసి వాటిని అట్ట పెట్టెలు, స్కూలు బ్యాగ్‌ల మధ్య కూర్చి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అతడిని అడ్డగించిన విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement