డ్యాన్స్ వీడియో తొల‌గించ‌మ‌న్నందుకు చంపేశారు

17 Year Old Boy Assasinated By His Friends In Mumbai - Sakshi

ముంబై : ఒక‌ యువ‌కుడు చీర ధ‌రించి డ్యాన్స్ చేస్తుండ‌గా త‌న‌తో పాటు ఉన్న న‌లుగురు స్నేహితులు ఆ వ్య‌క్తి డ్యాన్స్‌ను వీడియో చిత్రీక‌రించారు.ఈ విష‌యం తెలుసుకున్నస‌ద‌రు వ్య‌క్తి  వీడియోను డిలీట్ చేయాల‌ని అడిగినందుకు క‌త్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలోని ధారావి  స్ల‌మ్ ఏరియాలో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కౌశిక్ సునీల్ నారాయ‌ణ్ క‌ర్(17) అనే యువ‌కుడు ధార‌విలోని సుభాష్ న‌గ‌ర్‌లో ఉంటున్నాడు.  కౌశిక్ స్నేహితులు కూడా అత‌ను ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్నారు. (ఫైనాన్స్‌ వ్యాపారి కిడ్నాప్‌ కేసు కొత్త మలుపు)

స‌ర‌దాగా గ‌డుప‌దామ‌ని కౌశిక్ స్నేహితుల దగ్గ‌రికి వెళ్లాడు. కాగా వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు కౌశిక్ చీర ధ‌రించి డ్యాన్స్ చేశాడు. అయితే అత‌నికి తెలియ‌కుండా మిగ‌తా న‌లుగురు వారి ఫోన్లో వీడియోనూ చిత్రీక‌రించారు. ఈ వీడియోను అంద‌రికి చూపించి కౌశిక్‌ను ఆట‌ప‌ట్టిద్దామ‌ని భావించారు. అయితే వీడియో విష‌యం తెలుసుకున్న‌కౌశిక్ తన‌ డ్యాన్స్ వీడియో డిలీట్ చేయాల‌ని లేక‌పోతే పోలీసులకు లేదా త‌న అంకుల్ కు చెప్తాన‌ని హెచ్చ‌రించాడు. అయితే కౌశిక్ నిజంగానే పోలీసుల వ‌ద్ద‌కు వెళ్తాడేమోన‌ని  అత‌ని స్నేహితులు అనుమానించారు.  దీంతో త‌న అంకుల్ ఇంటికి వెళ్లి తిరిగి వ‌స్తున్న కౌశిక్‌ను ఆపి క‌త్తితో పొడిచారు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ కౌశిక్ క‌న్నుమూశాడు.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కౌశిక్ హ‌త్య‌కు కార‌ణ‌మైన న‌లుగురు యువ‌కుల‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ న‌లుగురిలో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు.  మైన‌ర్ల‌ను డొంగ్రి రిమాండ్ హోమ్ కు త‌ర‌లించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top