కేరళలో 123 కేజీల బంగారం సీజ్‌

123 kg Gold Worth 50 Crores Seized In Kerala - Sakshi

కొచ్చి: కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో రూ.50 కోట్ల విలువ చేసే దాదాపు 123 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. రాష్ట్రంలో స్మగ్లింగ్‌ సిండికేట్‌పై జరిగిన ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలో 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని సీజ్‌ చేసినట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ (ప్రివెంటివ్‌) సుమిత్‌ కుమార్‌ తెలిపారు. స్మగ్లర్లు తమిళనాడులోని వివిధ నగరాల నుంచి బంగారాన్ని సేకరించి, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్‌కు అక్రమంగా రవాణా చేశారని పేర్కొన్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న మొత్తం 17 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని తెలిపారు. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదు, రూ.6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top