ఉసురు తీసిన గాలిపటం !

11 Years Old Boy Died Due To Electric Shock In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌ : నర్సాపూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మృత్యువు గాలిపటం రూపంలో వచ్చి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. విద్యుత్‌ తీగలకు తగులుకున్న గాలిపటాన్ని తీయబోయిన ఓ బాలుడు కరెంట్‌ షాక్‌కు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలో తాండ్ర అరుణ్‌ కుమార్‌ అనే 11ఏళ్ల బాలుడు గాలిపటాన్ని ఎగరేస్తుండగా అదికాస్త కరెంట్‌ తీగలకు చిక్కుకుంది.

గాలిపటాన్ని తీగలనుంచి తప్పించేందకు బాలుడు ప్రయత్నిస్తుండగా.. కరెంట్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మెరుగైన చికిత్స చేయించటానికి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top