ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం

11 killed in Maharashtra accident - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో 11 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధూలే జిల్లా  నీమ్గల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు  చేసుకుంది.  

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top