గొంతువిని రేప్‌ నిందితుడ్ని గుర్తించిన అంధురాలు |  Visully Impaired Rape Survivor Reportedly Identified Accused By Voice | Sakshi
Sakshi News home page

గొంతువిని రేప్‌ నిందితుడ్ని గుర్తించిన అంధురాలు

May 7 2018 3:01 PM | Updated on Oct 4 2018 8:29 PM

  Visully Impaired Rape Survivor Reportedly Identified Accused By Voice - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని దేశ్‌బంధు గుప్తా రోడ్‌లో లైంగిక దాడికి గురైన 20 సంవత్సరాల అంధ యువతి గొంతును బట్టి నిందితుడిని గుర్తించారని పోలీసులు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న యువతి తల్లి నీళ్లు పట్టేందుకు వెళ్లగా, ఇద్దరు వ్యక్తులు  తల్లితో కలిసి తాను ఉంటున్న ఇంటి నుంచి ఆమెను బలవంతంగా పొరుగునే ఉన్న మరో ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులతో ఆ తర్వాత మరొకరు కలిశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొన్నారు.

మూడో వ్యక్తి సైతం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కౌన్సెలింగ్‌ కోసం స్వచ్ఛంద సంస్థకు తరలించారు. పదేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో ఆమె కన్ను దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో రోజుకు ఐదుగురికి పైగా లైంగిక దాడికి గురవుతున్నారన్న గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement