శత్రువులుగా కాకుండా స్నేహితులుగానే భావించండి! | Sakshi
Sakshi News home page

శత్రువులుగా కాకుండా స్నేహితులుగానే భావించండి!

Published Mon, Feb 24 2014 11:22 AM

శత్రువులుగా కాకుండా స్నేహితులుగానే భావించండి!

స్కాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఇన్వెస్టర్లు శత్రువులుగా భావించకుండా స్నేహితులుగానే పరిగణించాలని అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ సలహా ఇచ్చారు. నష్టభయాలను నుంచి ఇన్వెస్టర్లు తప్పించుకోవడానికి VIX ఫ్యూచర్స్(వాలటిలిటీ ఇండెక్స్) అనే కొత్త సూచీని ఫిబ్రవరి 26 తేదిన నేషనల్ స్టాక్ ఎక్సెంజీ (ఎన్ఎస్ఈ) ప్రారంభించనుంది. మార్కెట్ ఒడిదుడుకులను స్పెక్యులేటర్స్ సానుకూలంగా మార్చుకునేందుకు, ఈక్వీటి ఫోర్ట్ ఫోలియోలో మదుపుదారులు నష్టభయాల్ని తగ్గించుకునేందుకు VIX ఫ్యూచర్స్ ను ఉపయోగించుకోవచ్చని విశ్లేషకులు సూచించారు. 
 
వాలటిలిటీ ఇండెక్స్ ను అంతర్జాతీయ మార్కెట్ లో ఫియర్ ఇండెక్స్ గా పిలుస్తారు. ఫియర్ ఇండెక్స్ ను 1993లో తొలిసారి షికాగో బోర్డు ఆప్షన్స్ ఎక్చ్సెంజ్ (సీబీఓఈ) ప్రారంభించింది. 30 రోజుల సగటు వాలటిలిటి అంచనాలను VIX వెల్లడిస్తుంది. ఇక్విటీ సూచీలనైన ఎస్ ఆండ్ పీ 500, నిఫ్టీ లలో తీవ్ర ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని భావిస్తే VIX ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ల తీసుకోవడానికి ట్రేడింగ్ వ్యూహాంపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement