జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్ | TPG eyes on  Mukesh Ambani Jio Platforms   | Sakshi
Sakshi News home page

జియో మ్యానియా : క్యూలో టాప్ ఇన్వెస్టర్

Jun 11 2020 10:50 AM | Updated on Jun 11 2020 11:05 AM

 TPG eyes on  Mukesh Ambani Jio Platforms   - Sakshi

సాక్షి, ముంబై:  ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడుల మ్యానియా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీలు జియోలో పెట్టుబడులకు క్యూ కట్టాయి. తాజాగా ఈ వరుసలో మరో టాప్ కంపెనీ నిలవనుంది. వరుస మెగా డీల్స్ తో దూకుడుగా ఉన్న జియో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టాప్ ఇన్వెస్టర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ  టీపీజీ క్యాపిటల్  తో మరో భారీ ఒప్పందానికి  సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నట్టు సమాచారం.  (రిలయన్స్‌ జియోలో ఏఐడీఏ పెట్టుబడి)

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియోలో టీపీజీ క్యాపిటల్ 1 నుంచి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో రానుందని తెలిపింది. 1992లో ఏర్పాటైన  టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా  45కి  పైగా స్టార్టప్‌లలో 70 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా ఎయిర్‌ బీఎన్‌బీ, నైకా, లివ్‌స్పేస్, లెన్స్‌కార్ట్ , బుక్‌మైషో , సర్వేమన్‌కీ తదితరాలున్నాయి. (జియోలో రెండోసారి)

కాగా గత ఏడు వారాల్లో జియోలో 21 శాతం వాటాల విక్రయం ద్వారా ఇప్పటికే రూ. 97,885.65  కోట్ల పెట్టుబడులను సాధించింది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ (రెండుసార్లు), జనరల్ అట్లాంటిక్,  కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ)  కంపెనీలతో మెగా డీల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement