సంపాదనలో దూసుకెళ్తున్న టిక్‌టాక్ మాతృసంస్థ‌

TikTok Parent Bytedance Earns Huge Profit - Sakshi

ముంబై: వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ మాతృ సంస్థ, స్టార్టప్‌ బైట్‌డ్యాన్స్‌ లాభాలతో దూసుకెళ్తుంది. 2019 సంవత్సరంలో మొత్తం కంపెనీ రెవెన్యూలో 1700కోట్ల డాలర్లలో 300కోట్లు నికర ఆదాయం వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018 ఆదాయంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చైనాకు చెందిన  బైట్‌ డాన్స్‌ అత్యుత్తమ టెక్నాలజీతో ప్రపంచాన్ని అలరిస్తోంది. బైట్‌ డాన్స్‌ కేవలం నెలలో 15లక్షల మందిని వ్యూవర్స్‌ను సంపాదించుకుంటోంది. 

బైట్‌డ్యాన్స్‌కు టిక్‌టాక్‌తో పాటు డూయిన్‌, టోతియో లాంటి యాప్‌ల సేవలను వినియోగించుకుంటుంది. అమెరికన్‌ టీనజర్లను డ్యాన్స్‌ వీడియోలతో బైట్‌ డ్యాన్స్‌ విశేషంగా అలరిస్తోందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూజర్లకు సరికొత్త గేమ్స్‌, మ్యూజిక్‌ను ప్రవేశపెడుతూ యూజర్లు క్లిక్‌ చేసేలా వ్యూహాలు రచిస్తోంది. చైనీస్‌ స్టార్టప్‌ కంపెనీలలో బైట్‌ డ్యాన్స్‌ చరిత్ర సృష్టించిందని సింగపూర్‌కు చెందిన సాంకేతిక నిపుణుడు కీయాన్‌ విశ్లేషించారు.

చదవండి: టిక్‌టాక్‌కు మరో షాక్‌.. దావా వేసేందుకు సిద్ధం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top