తగ్గింపు ప్రీమియంతో స్టార్‌ కార్డియాక్‌ కేర్‌ పాలసీ

Star cardiac care policy - Sakshi

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తన కార్డియాక్‌ కేర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని సవరించింది. తగ్గింపు ప్రీమియం రేట్లతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు కార్డియాక్‌ కేర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని వయసు ప్రాతిపదికన 28–40 శాతం తగ్గింపు ప్రీమియంతో పొందొచ్చని కంపెనీ తెలిపింది. స్టార్‌ హెల్త్‌ 2013లో మొదటిసారి ఈ పాలసీని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది తీసుకున్నవారు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చు.

అలాగే బైపాస్‌ సర్జరీ కవరేజ్‌ కూడా ఉంది. ఔట్‌ పేషెంట్‌ వైద్య ఖర్చులకు, ప్రమాదవశాత్తు మరణానికి వ్యక్తిగత బీమా వంటి సౌలభ్యాలున్నాయి. సవరించిన పాలసీలో అన్ని రకాల డే కేర్‌  ప్రొసీజర్లు భాగంగా ఉంటాయి. ఇదివరకు 450 డే కేర్‌ ప్రొసీజర్లకు మాత్రమే పరిమితి ఉండేది. ‘2017–18లో స్టార్‌ కార్డియాక్‌ కేర్‌ పాలసీలో 27%వృద్ధి నమోదయ్యింది. కస్టమర్ల అవసరాన్ని తీర్చే ప్రొడక్టుల అభివృద్ధే మా లక్ష్యం’ అని కంపెనీ సీవోవో ఎస్‌.ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top