గోల్డ్‌ స్కీమ్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు

Sources Says No Proposal To Launch Gold Amnesty Scheme - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీసేందుకు గతంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్‌) స్కీమ్‌ తరహాలో వ్యక్తుల వద్ద పరిమితికి మించి పోగుపడిన బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్‌ ప్రవేశపెడుతుందని వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యక్తులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను స్వచ్ఛందంగా ప్రకటించే ఆమ్నెస్టీ స్కీమ్‌ వంటిదేమీ తమ ప్రతిపాదనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ సన్నాహక ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో ఇలాంటి వార్తలు రావడం సాధారణమేనని కొట్టిపారేసింది. కాగా బంగారంపై నియంత్రణలు విధిస్తూ పరిమితికి మించిన బంగారం ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించే పథకం త్వరలో ఖరారు కానుందని, గోల్డ్‌ బోర్డ్‌ ఏర్పాటవుతుందని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. రసీదులు లేకుండా కొనుగోలు చేసిన బంగారం విలువ మొత్తంపై పన్ను విధింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి.

చదవండి : బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top