ఆ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10 వేల ధర తగ్గింపు

 Sony Xperia XZs, Xperia L2, Xperia R1 Price Cut in India - Sakshi

సోనీ మొబైల్స్‌ తన మూడు స్మార్ట్‌ఫోన్లపై శాశ్వతంగా ధర తగ్గించింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఎల్‌2, ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్లపై జూలై 6 నుంచి ధరలు తగ్గించినట్టు సోనీ ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.29,990 కు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 39,990 రూపాయలు. అంటే 10 వేల రూపాయల మేర ధర తగ్గింది. ఇక ఎక్స్‌పీరియా ఎల్‌2 స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ.19,990 నుంచి రూ.14,990కు తగ్గించింది సోనీ కంపెనీ. ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,990 కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.10,990గా ఉండేది. ఈ ధరలు సోనీ అన్ని సెంటర్లలోనూ, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. ధర తగ్గక ముందు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌.ఇన్‌లో రూ.39,990కు లభ్యమయ్యేది. 

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ గతేడాది మన మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన తర్వాత ఇదే అత్యంత ఖరీదైన ధర తగ్గింపు. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 820 ఎస్‌ఓసీ, ఆండ్రినో 510 జీపీయూ, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 19 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 

మిండ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ అయిన ఎక్స్‌పీరియా ఎల్‌2, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాడ్‌-కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ6737టీ ఎస్‌ఓసీ, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాలున్నాయి.

ఇక చివరిగా ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్‌ గతేడాది అక్టోబర్‌లోనే స్టోర్లలోకి అందుబాటులోకి వచ్చింది. 5.2 అంగుళాల హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top