
నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముందురోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం తొలి సెషన్లో నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 182.50 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 46.55 పాయింట్ల నష్టంతో 8158.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ముందురోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం తొలి సెషన్లో నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 182.50 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 46.55 పాయింట్ల నష్టంతో 8158.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం 27,290.17 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. తర్వాత 27,068.60 పాయింట్లకు పడిపోయింది. ఇప్పటివరకు ఇంట్రాడేలో అత్యధికంగా 27,293.99 పాయింట్లను తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 26,981.49 వద్ద ట్రేడయింది. బ్యాంకింగ్, రియాల్టీ, ఐటీ, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది.