ఆర్‌బీఐ రేటు కట్‌ : మార్కెట్లు ఫట్‌

Sensex Nifty Stage Biggest Fall Of 2019 Despite RBI Cutting Rates - Sakshi

సాక్షి,ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ రెపోరేట్‌ కట్‌ నిర్ణయంతో  ఇన్వెస్టర్లు నెగిటివ్‌గా స్పందించారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌  షేర్లలో భారీ అమ్మకాల  ధోరణి కనిపించింది. దీంతో నిఫ్టీ బ్యాంకు  (700) గత నాలుగేళ్లలోలేని భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక  సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ కూడా  దాదాపు అదే బాట. సెన్సెక్స్‌ 554 పాయింట్లు క్షీణించి 39530 వద్ద, నిఫ్టీ 178 పాయింట్లు పతనమై 11844 వద్ద ముగిసాయి  2019లో అతి పెద్ద వన్‌డే పతనాన్ని నమోదు చేశాయి.   రిలయన్స్  క్యాపిటల్‌‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా భారీగా నష్టపోయాయి.  తద్వారా సెన్సెక్స్‌ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరాయి. అన్ని రంగాలూ   నష్టాల్లో ముగియాగా, ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5 శాతం కుప్పకూలింది.  ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఫార్మా, మీడియా రంగాలుకూడా ఇదే బాటలో నడిచాయి. 

 గెయిల్‌ 11.5 శాతం కుప్పకూలగా.. ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, ఎంఅండ్‌ఎం 7.7-2.4 కుప్పకూలి టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.   అలాగే రిలయన్స్‌  క్యాప్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కూడా భారీగా నష్టపోయాయి.   పీఎస్‌యూ బ్యాంక్స్‌లో అలహాబాద్‌, ఓబీసీ, బీవోబీ, సిండికేట్‌, బీవోఐ, యూనియన్‌, ఎస్‌బీఐ, కెనరా, పీఎన్‌బీ, జేఅండ్‌కే, ఇండియన్‌ బ్యాంక్‌ 7.4-2.4 శాతం మధ్య నీరసించాయి. మరోవైపు కోల్‌ ఇండియా, టైటన్‌, హీరోమోటో, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌, యూపీఎల్‌ 3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top