ఈ ఫోన్‌ ధర రూ. 4వేలు : స్పెషల్‌ ఏంటి?

Seniorworld launches easyfone Grand for senior citizens, priced at Rs 3,990 - Sakshi

ప్రత్యేకంగా సీనియర్ల కోసమే 

బడ్జెట్‌ ధర, స్పెషల్‌ టెక్నాలజీ

స్పెషల్‌  ఇయర్‌ఫోన్స్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్‌  సిటిజన్లకోసం ఒక సులభతరమైన  ఒక మొబైల్‌ను  విడుదల చేసిందో కంపెనీ. సీనియర్ వరల్డ్  అనే కంపనీ ‘ఈజీ ఫోన్‌ గ్రాండ్‌’ పేరుతో ఒక  ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అదీ బడ్జెట్‌ ధరలోనే. తద్వారా  ఫీచర్ ఫోన్లన్నీ కేవలం  యూత్‌కోసమే కాదు...సీనియర్ సిటిజన్లకోసం కూడా అన్న సందేశాన్నిస్తోంది.  వారు సౌలభ్యంగా వినియోగించుకునేందుకు వీలుగా చాలా ‘ఈజీ’గా రూపొందించామని  కంపెనీ చెప్పింది. భారత దేశంలో  ఈ తరహా ఫోన్‌ లాంచ్‌ చేయడం ఇదే మొదటిసారని కంపెనీ చెబుతోంది. వినికిడి సమస‍్య ఉన్న వారు,  హియరింగ్‌ సాధనాలు  పెట్టుకోవడానికి ఇష్టపడని వారికి  తమ ఫోన్‌ మంచి పరిష్కారమంటోంది.  స్పెషల్‌ టెక్నాలజీ, స్పెషల్‌  ఇయర్‌ఫోన్స్‌  ఈ డివైస్‌ ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. సరసమైన దరలో  కేవలం రూ. 3,990కే  ఈ ఈజీఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ  తెలిపింది.   సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నాలుగు ఆటోమేటెడ్ పనులను నిర్వహించేలా ఎస్ఓఎస్ బటన్‌తో  పాటు ఇంకా  ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్‌గా ఈ ఫోన్‌లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్‌ సిటిజనుల  ప్రత్యేక అవసరాలకు,  కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందనే  విశ్వాసాన్ని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా వ్యక్తం చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top