సహారా ఆస్తుల వేలానికి సెబీ నోటీసులు | Sebi issues warning on Sahara debt | Sakshi
Sakshi News home page

సహారా ఆస్తుల వేలానికి సెబీ నోటీసులు

Sep 22 2016 1:24 AM | Updated on Sep 4 2017 2:24 PM

సహారా ఆస్తుల వేలానికి సెబీ నోటీసులు

సహారా ఆస్తుల వేలానికి సెబీ నోటీసులు

సహారా గ్రూప్‌నకు చెందిన మరో 13 ఆస్తుల వేలానికి సెబీ బుధవారం నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన మరో 13 ఆస్తుల వేలానికి సెబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ పక్రియ కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్‌బీఐ క్యాప్స్), హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ సేవలను సెబీ  వినియోగించుకుంటోంది. వచ్చే నెలలో తాజాగా జరగనున్న13 ఆస్తుల వేలానికి సంబంధించి రిజర్వ్ ధరను దాదాపు రూ.1,400 కోట్లుగా సెబీ నిర్ణయించింది.  అక్టోబర్ 27న ఏడు ఆస్తులకు హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ వేలం నిర్వహిస్తుందని సెబీ తెలిపింది. వీటి రిజర్వ్ ధర రూ.710 కోట్లు. ఇక ఎస్‌బీఐ క్యాప్స్ ఆరు ఆస్తులకు అక్టోబర్ 25న వేలం నిర్వహిస్తుందని పేర్కొన్న సెబీ, దీని రిజర్వ్ ధరను రూ.672 కోట్లుగా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement