రిలయన్స్‌ రిటైల్‌కు 94వ ర్యాంక్‌

Reliance Retail 94th Spot On Deloitte Top Retailers List - Sakshi

న్యూఢిల్లీ: ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ మరో ఘనత సాధించింది. డెలాయిట్‌ ప్రకటించిన గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2019 ఇండెక్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 94వ స్థానంలో నిలిచింది. గతేడాది మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆదాయం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 250 సంస్థలకు డెలాయిట్‌ ర్యాంకులు కేటాయించిందని రిలయన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పతుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సంస్థకు మంచి ర్యాంకు దక్కించుకుందని వెల్లడించింది. (ఈ–కిరాణాలో హోరాహోరీ)

డెలాయిట్‌ ప్రకటించిన టాప్‌ 250 రిటైల్‌ కంపెనీల జాబితాలో అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేసి వాల్‌మార్ట్‌ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంది. అమెరికన్‌ కంపెనీలు కాస్ట్‌కో, క్రోజర్‌ వరుసగా రెండో, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్‌టెన్‌లో ఏడు అమెరికా కంపెనీలు ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అత్యధికంగా 87 యూరోప్‌ కంపెనీలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top