తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు | Reduced foreign exchange reserves | Sakshi
Sakshi News home page

తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు

Dec 31 2016 1:51 AM | Updated on Oct 4 2018 5:26 PM

తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు - Sakshi

తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు

విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ నెల 23తో ముగిసిన వారానికి తగ్గాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 94 కోట్ల డాలర్లు తగ్గి 35,967 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్‌బీఐ తెలిపింది.

విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడమే కారణం
ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ నెల 23తో ముగిసిన వారానికి తగ్గాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 94 కోట్ల డాలర్లు తగ్గి 35,967 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం,,.  అంతకు ముందటి వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 238 కోట్ల డాలర్లు క్షీణించి 36,060 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగిసిన వారానికి ఈ నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి, 37,199 కోట్ల డాలర్లకు పెరిగాయి.

ఇక ఈ నెల 23తో ముగిసిన వారానికి మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సీఏ–ఫారిన్ కరెన్సీ అసెట్స్‌) 93 కోట్ల డాలర్లు తగ్గి 33,597 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి నిల్వలు నిలకడగా 1,998 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్దనున్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 9 లక్షల డాలర్లు తగ్గి 142 కోట్ల డాలర్లకు పడిపోయాయి.దీంతో ఐఎంఎఫ్‌ వద్ద భారత రిజర్వ్‌  పొజిషన్  11 లక్షల డాలర్లు తగ్గి 229 కోట్ల డాలర్లకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement