కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్‌

REC pays Rs 1143 cr interim dividend for FY19 to govt - Sakshi

ఒక్కో షేర్‌కూ రూ.11 డివిడెండ్‌

రూ.4,508 కోట్లకు నికర లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను  ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.  ఈ మొత్తానికి సమానమైన ఆర్‌టీజీఎస్‌  క్రెడిట్‌ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ ప్రభుత్వానికి అందజేసింది.   

రూ.96,357 కోట్ల రుణాలు:  ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్‌ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top