రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌ | Sakshi
Sakshi News home page

రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్‌

Published Tue, Feb 25 2020 10:33 AM

Realme X50 Pro 5G with Dual Selfie Cameras - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ తయారీ దిగ్గజం రియల్‌మి తాజాగా భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించింది. రియల్‌మి ఎక్స్‌50 ప్రొ 5జీ పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం సీఈవో మాధవ్ సేఠ్ తెలిపారు. దీని ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.  మెమరీ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి మూడు వేరియంట్లో లభ్యం. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 4జీ, 5జీ టెక్నాలజీపై పనిచేసేలా డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అయితే, దేశీయంగా ఇంకా 5జీ టెక్నాలజీ అమల్లోకే రానందున.. ఈ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండబోదని మార్కెట్‌ రీసెర్చ్ సంస్థ టెక్‌ఆర్క్‌ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైసల్‌ కవూసా వ్యాఖ్యానించారు. 2022 నాటికి గానీ భారత్‌లో 5జీ నెట్‌వర్క్ పూర్తిగా విస్తరించకపోవచ్చని, అప్పటికి ఈ ఫోన్లలోని టెక్నాలజీ పాతబడిపోవచ్చని పేర్కొన్నారు. అప్పటికి వీటి రేట్లు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. 4జీ ఫోన్ల విషయంలో ఇదే జరిగిందని ఫైసల్ చెప్పారు. 

ధరలు 
రూ. 37,999
రూ. 39,999
రూ. 44,999


రియల్‌ మీ ఎక్స్‌ 50 ప్రొ ఫీచర్లు
6.44 అంగుళాల డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 10
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 865 సాక్‌ 
64 జీబీ/128 జీబీ స్టోరేజ్‌
64+12+8+2 ఎంపీ రియల్‌
32+8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4200 ఎంఏహెచ్‌  బ్యాటరీ

Advertisement

తప్పక చదవండి

Advertisement